WGL: మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే నర్సంపేట అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం చెన్నారావుపేట మండలం బాపునగర్కు చెందిన పలువురుకాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆయన పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.