NLG: పెట్రోల్ బంక్ డీలర్లు బాధ్యతతో మెలగడమే గాక, సేవలో ప్రజలకు జవాబుదారీ తనంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన నల్గొండలో పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. డీలర్లు కొందరు బంకు నిర్వహణను తేలిగ్గా తీసుకుంటున్నారని ఆక్షేపించారు.