KMM: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని BJP జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణారావు తెలిపారు. శనివారం మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రుపాలెం మండల రెవిన్యూ అధికారులకు వినతి పత్రం అందించారు. గుంతల మయంగా తయారైన రహదారులకు మరమ్మతులు చేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.