SRCL: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రి పురస్కరించుకుని ఆలయ అర్చకులు మాహా లింగార్చన నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అద్దాల మండపంలో మహాలింగ అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.