NLG: అర్హత కలిగిన పేద జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గణతంత్ర దినోత్సవంపురస్కరించుకొని క్రీడా పోటీల్లోగెలుపొందిన జర్నలిస్టులకు బహుమతు ప్రధానం చేయడం, అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.