VSP: శ్రీకాకుళంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థిని లైంగికదాడి ఆరోపణల ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డితో ఫోన్లలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రిమ్స్‌లో ఉన్న యువతికి మెరుగైన వైద్య సదుపాయాలందించాలని ఆదేశించారు. నిందితుల కోసం ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హోం మంత్రికి వివరించారు.