WGL: హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో శనివారం గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డీజీపీ శశిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపిన పోలీస్ శాఖకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

