GDWL: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మల్దకల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం విజిట్ చేశారు. పోలింగ్ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భద్రత ఏర్పాట్ల గురించి పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. నిర్దేశించిన సమయంలో పోలింగ్ పూర్తయ్యేలా చూడాలన్నారు.