గద్వాల: గురువారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. గత వారం రోజులుగా గన్ని సంచులు, రవాణా వాహనాలు లేవని, అధికారుల నిర్లక్ష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపించారు. పంటను అమ్ముకున్నా సంచులు, వాహనాల బాధ్యత రైతులదే అని అధికారులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు.