ASF: రెబ్బెన మండలంలో భార్యను గొడ్డలితో నరికిన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన గజ్జల తిరుపతి తన భార్య స్రవంతిని (38) గొడ్డలితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హత్యకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.