MLG: జిల్లా హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ బాయ్స్ ఎంపికలు నిర్వహించినట్లు హ్యాండ్ బాల్ ఇంఛార్జ్ కోచ్ కుమారస్వామి తెలిపారు. క్రీడల అధికారి తుల రవి హాజరై 40 మంది క్రీడాకారుల్లో 12 మందిని ఆల్ ఇండియా ఇంటర్ డిస్టిక్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక చేశారన్నారు. వీరంతా జనవరి 27 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.