KMR: బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబెర్ మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మోచి గణేష్, చాకలి మహేష్, రమేష్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.