MDK: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో 21 జడ్పీటీసీ, 21 ఎంపీపీ స్థానాలకు ఎన్నికల మార్గదర్శకాలను అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, రాజకీయ పక్షాల ప్రతీదుల సమక్షంలో మహిళా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు.