BHPL: టేకుమట్ల మండలంలో కాంగ్రెస్, BRS పార్టీల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు దిష్టిబొమ్మల దహనానికి పూనుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇరు పార్టీ శ్రేణులు ఏకకాలంలో నిరసనలు చేయాలని భావించగా, అవాంఛనీయ ఘటనల నివారణకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.