MDK: రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా విద్యుత్ వైర్ల కింద కట్టిన ఫ్లెక్సీల తీస్తుండగా విద్యుత్ షాక్తో మృతి చెందిన నవీన్, ప్రశాంత్ కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మా దేవేందర్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి చెరో రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు.