PDPL: ఓదెల మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. శుక్రవారం ఇంట్లో ఎవరు లేరని, తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 2 తులాల బంగారం, నగదు రూ.20 వేలు చోరీ అయ్యాయని బాధితుడు రాపెళ్లి రాజయ్య తెలిపారు. సంఘటన స్థలానికి పోత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.