NRML: బైంసా పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి వారు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. వీరి వెంట స్థానిక బీజెేపీ నాయకులు ఉన్నారు.