ADB: మాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాల సంక్షేమ సంఘం ఉట్నూర్ మండల అధ్యక్షులు ఎర్దండి సుశీల్ కుమార్ కోరారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణానికి వెళ్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మాలల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్తో కలిసి ఆయన కలిశారు. మాలల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలన్నారు.