KMM: స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం వేంసూర్ మండలంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు.