W.G: జిల్లా వ్యాప్తంగా మొదటి విడుత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిర్వహించారన్నారు. ప్రతిరోజు ఉ.9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.