E.G: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ శనివారం ఒక ప్రకటనలో స్పందించారు. ఇండియా కూటమి ‘ఇగో’లకు పొతే ఎలక్షన్ ఫలితాలు ఇలానే ఉంటాయన్నారు. ఈ ఓటమికి కారణం కేజ్రీవాల్ 80%, రాహుల్ గాంధీ 20% కారణమని అన్నారు. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ఇండియా కూటమిలోని పార్టీలన్ని ఒకసారి కూర్చొని మేధోమధనం చేసుకోవాలని సూచించారు.