MBNR: జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బిసీ ఐక్యవేదిక నాయకులు 42% బీసీ రిజర్వేషన్ బిల్ హైకోర్టు స్టే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర నాయకులు రవి ముదిరాజ్ మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యాకే స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలని వారి డిమాండ్ చేశారు. ఈ నిరసనలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు.