MNCL: బెల్లంపల్లి పట్టణ రామాలయ ప్రధాన అర్చకులు చిమిరాల వేణుగోపాలచార్యులు అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. MLA గడ్డం వినోద్ వారి నివాసానికి వెళ్లి అయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అర్చకులు వేణుగోపాలచార్యుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.