BDK: పాల్వంచ మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం మండల నాయకులు మాట్లాడుతూ.. కలెక్టర్ ఆఫీస్ నుంచి పాలకోయ తండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రహదారులన్నీ గుంతలమయంతో ఉండడంతో మహిళలు, పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచి కంటి నగర్ పాలకోయ తండా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.