MDK: ప్రజా సమస్యల పరిష్కారం కోసం మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామ దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. త్వరలోనే మెదక్ నియోజకవర్గంలో గ్రామ దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. క్యాంపు ఆఫీస్కే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు.