WGL: మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. నర్సంపేట మండలానికి చెందిన శారుణి(12) అనే బాలిక 8వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్తున్నాననీ చెప్పి సోమవారం ఉదయం వెళ్లింది. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి రాకపోవడంతో బాలిక ఆచూకీ కోసం గాలించారు. దొరకకపోవడంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.