KNR: జిల్లా పట్టు పరిశ్రమల సహాయ అధికారిగా మహమ్మద్ రషీద్ పదోన్నతి పొందారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రషీద్ హుజురాబాద్ డివిజన్ సెరికల్చర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. శాఖాపరమైన అర్హతలు ఉన్నందున రషీద్ సహాయ పట్టు పరిశ్రమ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ యాస్మిన్ భాష ఉత్తర్వులు జారీ చేశారు.