VSP: నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యోగివేమన జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వేమన పద్యాలు నేటికీ ప్రజలను చైతన్యం కలిగిస్తున్నాయన్నారు.