PDPL: పెంచికలపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈనెల 30న, నిర్వహించే ఫ్రీ మెడికల్ క్యాంపును, గ్రామస్థులు వినియోగించుకోవాలని జీఎం వెంకటయ్య పేర్కొన్నారు. సింగరేణి వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న యాజమాన్యం దృష్టికి తీసుకురావాలన్నారు.