WNP: నేడు వనపర్తి జిల్లాకు నలుగురు రాష్ట్ర సమాచార కమిషనర్లు రానున్నారు. సమాచార కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో సమాచార హక్కు చట్టం-2005 కింద దాఖలైన అప్పీళ్లు చాలా పెండింగ్లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్లను నియమించడంతో ఇప్పుడు ఆ పెండింగ్ అప్పీళ్లను పరిష్కరించేందుకు మార్గం సుగమమైందని ఇన్ఛార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.