MDK: మెదక్ జిల్లాలో 6,7,8 తేదీల్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే స్టిక్కరింగ్లో 2.20 లక్షల ఇండ్ల జాబితా నమోదు చేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈరోజు నుంచి జిల్లా వ్యాప్తంగా 1600మంది ఎన్యుమరేటర్లు, 170 మంది సూపర్ వైజర్లు సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.