NLG: మాడుగులపల్లి మండలం ఆగమోత్కూర్ గ్రామ సర్పంచ్ అండం రేణుక యాదయ్య ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీపీఎం బలపరిచిన అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, CPM నాయకులు తదితరులు పాల్గొన్నారు.