NRPT: మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది.ప్రధాన రహదారి పక్కనే చెత్తాచెదారం కుప్పలుగా పేరుకుపోవడంతో స్థానికులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో పాదాచారులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.