NRML: ఈ నెల 22న జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి వాయిదా వేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ నెల 29 నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. గ్రామపంచాయతీ నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ప్రజావాణి వాయిదా వేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.