GDWL: కేటిదొడ్డి మండలం నందిని నుంచి ఎర్రవల్లి చౌరస్తా వరకు ఉన్న రోడ్డును 4 లైన్ల రోడ్డుగా మార్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పనుల జాతర కార్యక్రమంలో కేటిదొడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.