NZB: నిన్నటి వరకు SRSP 39 వరద గేట్లను తెరిచి దిగువకు నీటిని వదలగా ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇన్‌ఫ్లో తగ్గడంతో శుక్రవారం 27 వరద గేట్లను మూసివేశారు. 12 గేట్లను తెరిచి ఉంచి 35,293 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,61,251 క్యూసెక్కులు వస్తుండగా, ఔట్‌ఫ్లో 51,560 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.