ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రెండు రోజుల పాటు ‘క్యాంపస్ టు కార్పొరేట్ కనెక్ట్’ పేరిట సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చారు. తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, టాస్క్ సౌజన్యంతో నిర్వహించిన ఈ తరగతుల్లో ప్రిన్సిపల్ డాక్టర్ జే. సంగీత మాట్లాడారు. విద్యార్థులు కెరీర్లో రాణించాలంటే కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరని పేర్కొన్నారు.

