MDK: ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన సైబర్ మోసాలు నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లోన్ ఫ్రాడ్ వంటివి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రజల భద్రత కోసం సైబర్ క్రైమ్ 24 గంటలు పనిచేస్తుందని పేర్కొన్నారు.