MDK: రామాయంపేట కస్తూర్బా విద్యాలయంలో మెట్లపై నుంచి కింద పడి ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. సంకాపూర్కు చెందిన ప్రియాంక నిజాంపేట విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. గురువారం మధ్యాహ్నం ఎవరో తోసి వేయడంతో మెట్లపై నుంచి కిందపడి గాయాలైనట్లు బాలిక తెలిపింది. బాలికను సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. బాలికా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.