ELR: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన సమయంలో ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. బాణసంచా, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఒకే రోజు అధిక సంఖ్యలో నిమజ్జనాలు జరగకుండా చూడాలని సూచించారు.