MBNR: జిల్లా క్రీస్టియన్ కాలనీ, ఎర్రసత్యం చౌరస్తాలో ‘ప్రజాబాట’ కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యుత్ శాఖ అధికారులు 11 కేవీ, ఎల్డీ లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించారు. వినియోగదారులు వోల్టేజ్ సమస్య ఉందని విన్నవించడంతో అధికారులు తక్షణమే నూతన డీటీఆర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఆపరేటర్ పీవీ రమేష్, డీఈఈ నవీన్ పాల్గొన్నారు.