WGL: ప్రజావాణి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ నేరుగా వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.