SRPT: పెద్దగట్టు లింగమంతుల స్వామిజాతరకు నిద్రాహారాలు మాని నూతన కమిటీపనిచేయాలని పీసీసీ సభ్యులు,పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్లో దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవస్థానంకు నూతనకమిటీ ఎన్నికైన సందర్భంగా కొప్పుల వేణారెడ్డిని కలిసి శాల్వాతో సత్కరించి పూలబోక్కెను అందజేసి మాట్లాడారు.