BHNG: ఇచ్చిన హామీని ELV భాస్కర్ ఫౌండేషన్ ఛైర్మన్ భాస్కర్ మాట నిలబెట్టుకున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు ప్రాథమిక పాఠశాలలో అదనపు గదులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన, నూతన భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలన్నదే తన లక్ష్యమని ఆయన అన్నారు.