MBNR: నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటూ సేవా భావంతో వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూపరింటెండెంట్ రంగయ్యకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన రంగయ్య శుక్రవారం కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసే ఆసుపత్రిని మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు.