HYD: ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.