MBNR: జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హనుమాన్ పుర, పాలిటెక్నిక్ కళాశాల, గణేష్ నగర్, గౌడ్స్ కాలనీ,వల్లభ నగర్, బండ్ల గేరి, రవీంద్రనగర్ ప్రాంతాలలో సమస్య తీవ్రంగా ఉంది. దీంతో మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను చేస్తున్నారు. లైన్ మెన్లకు ఫోన్లు చేసినా కూడా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు.