NZB: మోస్రా మండలం చింతకుంట గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఛైర్మన్ గుడిపల్లి గంగారెడ్డి అధ్యక్షతన 66వ మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ.. SAO లోన్, LTలోన్ సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. రబీలో రూ. 500ల బోనస్ ఎవరికీ అందలేదని, ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రైతులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.