WGL: జిల్లాలో నగరంలోని గోపాలస్వామి గుడి సెంటర్లో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వరంగల్ మేయర్ గుండు సుధారాణి, 20వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్ర కుమార్లు హాజరై, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను వారు కొనియాడారు.