WNP: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఘనపూర్ మండలంలోని సోలిపూర్, ఉప్పరపల్లి షాపూర్ సహా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు.